నామినేటెడ్ పదవుల్లో మాదిగలకు ప్రాతినిధ్యం కల్పించాలి
పదవులు దక్కకపోవడంపై మండల స్థాయిలో మాదిగ నాయకులు, కార్యకర్తల అంతర్గత సమావేశం మూకుమ్మడి రాజీనామాలపై చర్చ జరుగుతోందన్న ప్రచారం కోనరావుపేట మండలం తెలంగాణ అడ్డా సెప్టెంబర్ 21 కోనరావుపేట మండల పరిధిలో అధికార పార్టీకి చెందిన మాదిగ సామాజిక వర్గం నాయకులు, కార్యకర్తలు నామినేటెడ్ పదవుల్లో తమకు తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదనే అంశంపై అంతర్గతంగా సమావేశమైనట్లు సమాచారం. మండలంలో మాదిగ సామాజిక వర్గానికి గణనీయమైన జనాభా, ఓటు ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ నామినేటెడ్ పదవులు, మార్కెట్ కమిటీలు, వివిధ ప్రభుత్వ కమిటీలు, పార్టీ బాధ్యతల్లో తగిన ప్రాతినిధ్యం లభించడం లేదనే అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. “ఓటు సమయంలో మాదిగల ప్రాధాన్యత గుర్తుకు వస్తుంది.....