అక్షర కిరీటి అవార్డు గ్రహీతగా బొమ్మరాతి ఎల్లయ్య
అక్షర కిరీటి అవార్డు గ్రహీతగా బొమ్మరాతి ఎల్లయ్య తెలంగాణ అడ్డా న్యూస్, భద్రాద్రి జిల్లా ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ప్రముఖ రచయిత, శిల్పి, చిత్రకారుడు, సింగరేణి మాజీ ఉద్యోగి బొమ్మరాతి ఎల్లయ్యకు ‘అక్షర కిరీటి’ అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్లోని ఎటపాక మండలంలోని పాల్రాజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన శతాధిక కవి సమ్మేళనంలో ఎల్లయ్యను ఘనంగా సన్మానించారు. ఆయన రచించిన కవితలు, సాహిత్య సేవతో పాటు శిల్పి, చిత్రకారుడిగా అందిస్తున్న సేవలను గుర్తించి ‘అక్షర కిరీటి’ బిరుదుతో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ...