కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
తెలంగాణ అడ్డా వేములవాడ: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతికి, తెలంగాణ రాష్ట్ర సాధనకు బాపూజీ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సాధికారిత సంఘం ఉత్తర తెలంగాణ జిల్లాల ఇంచార్జీ పొలాస నరేందర్ మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు, బలహీన వర్గాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని అన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేసిన తెలంగాణవాది, స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి బాపూజీ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు బీసీలు, అణగారిన వర్గాలు...