కోనరావుపేటలో ఘనంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు
1. మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు 2. పెద్ద సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 3. ఆది శ్రీనివాస్ ప్రజా సేవలను కొనియాడిన నాయకులు 4. నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్ష కోనరావుపేట, సెప్టెంబర్ 19 (తెలంగాణ అడ్డ): కోనరావుపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానుక సత్యం ఆధ్వర్యంలో వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఆది శ్రీనివాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య,...