ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు గన్నేరువరం, సెప్టెంబర్ 17 (తెలంగాణ అడ్డా): భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన చారిత్రాత్మక రోజైన సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని గన్నేరువరం మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడానికి 1948 సెప్టెంబర్ 17 వరకు సమయం పట్టిందని గుర్తుచేశారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ నాయకత్వంలో చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ అనంతరం హైదరాబాద్...