Back to Home
Watermark
మంగళవారం, 03 నవంబర్, 2026 TIME : 09:17 PM

రైతన్నలు కరువు పట్ల ఆలోచన చేయాలి

Main Image

రైతన్నలు కరువు పట్ల ఆలోచన చేయాలి

సూపర్ ఎల్నినో ద్వారా కరువు

ప్రతిపక్షాల ఆరోపణలు నమ్మవద్దు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో పని చేస్తోంది

రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు

పెద్దపల్లి జిల్లా నవంబర్ 03 తెలంగాణ అడ్డా

పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు, కొత్తపల్లి, మూలసాల, బోజన్నపేట, హనుమంతునిపేట, మారేడుగొండ, గుర్రాంపల్లి, చీకురాయి గ్రామాల్లో

పెద్దపల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో, చందపల్లిలో ఐకేపీ & సింగిల్ విండో వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన రాష్ట ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ ఎల్నినో కారణంగా భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే విజయరమణ రావు సూచించారు. కరువు పట్ల రైతన్నలు ఆలోచన చేయలని యాసంగిలో వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సమృద్ధిగా పండే మొక్కజొన్న (మక్కలు), శెనగ వంటి ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు పంటలను సాగు చేసుకోవాలని పిలుపునిచ్చారు. దలారుల చేతిలో రైతులు మోసపోకుండా ఉండేందుకు మండలంలో ఐకేపీ మరియు సింగిల్ విండో ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. రైతు తన పంట అమ్మిన రెండు రోజుల్లోనే తన ఖాతాలో డబ్బులు జమ అవుతాయని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉందని ధాన్యం కొనుగోళ్ల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచనలు చేశారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్, డైరెక్టర్లు, పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు,రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments