మాదిగ విద్యార్థులకు విద్యపై దిశానిర్దేశం ఎంఎస్ఎఫ్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక

కమలాపూర్, తెలంగాణ అడ్డా ప్రతినిధి
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామంలో శుక్రవారం రాత్రి మాదిగ విద్యార్థులతో సమావేశం నిర్వహించి, ఎంఎస్ఎఫ్ నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చేపట్టిన కమిటీల ఎన్నికల్లో భాగంగా ఎమ్మార్పీఎస్ కమలాపూర్ మండల అధ్యక్షుడు గోల్కొండ శ్రీకాంత్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమానికి కమలాపూర్ మండల ఇన్చార్జి శనిగరపు రవీందర్ మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు శనిగరపు చేరాలు మాదిగ, ఎంఎస్పీ మండల ఉపాధ్యక్షుడు గోల్కొండ నాగరాజు మాదిగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ చదువుకు దూరం కావద్దని సూచించారు. మంద కృష్ణ మాదిగ మూడు దశాబ్దాల పోరాటం, మాదిగ అమరవీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న ఎస్సీ రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఎంఎస్ఎఫ్ నూతన గ్రామ కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా గోల్కొండ రిత్విక్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా గోల్కొండ అజయ్ మాదిగ, ఉపాధ్యక్షుడిగా కొడెపాక శ్రీనాథ్ మాదిగ, కార్యదర్శిగా గోల్కొండ పార్థు మాదిగ, కోశాధికారిగా బొల్లె విశ్వేశ్వర్ మాదిగ, గౌరవ సలహాదారుగా గోల్కొండ హర్షవర్ధన్ మాదిగలను నియమించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నేరెళ్ల గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు గోల్కొండ సందీప్ మాదిగతో పాటు గోల్కొండ రాజ్ కుమార్ మాదిగ, గోల్కొండ రతన్ మాదిగ, గోల్కొండ వంశీ మాదిగ, గోల్కొండ రిషి మాదిగ, గోల్కొండ మనోజ్ మాదిగ, కోల వరుణ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.