Back to Home
Watermark
శుక్రవారం, 30 అక్టోబర్, 2026 TIME : 09:35 PM

కమలాపూర్‌లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన

Main Image

ఆసుపత్రి, గురుకుల విద్యాలయం తనిఖీ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన

కమలాపూర్, తెలంగాణ అడ్డా ప్రతినిధి

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కమలాపూర్ మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా కమలాపూర్‌లోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)ని తనిఖీ చేసి, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి వైద్య సేవలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఎం.జె.పి బాలుర గురుకుల విద్యాలయాన్ని సందర్శించి పర్యవేక్షించారు. గూనిపర్తి గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి ఇళ్ల నిర్మాణ పురోగతి, సంబంధిత వివరాలను తెలుసుకున్నారు.

ఈ పర్యటనలో స్థానిక సర్పంచ్ బుర్ర రాధిక కరుణాకర్, తహసీల్దార్ (ఎంఆర్ఓ), ఎంపీడీఓతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Clip Adjustments