Back to Home
Watermark
మంగళవారం, 27 అక్టోబర్, 2026 TIME : 09:01 PM

అచ్చన్నపల్లిలో ‘మంగళవారం 10 నిమిషాలు’ కార్యక్రమం

Main Image

తెలంగాణ అడ్డా ప్రతినిధి – వేములవాడ:

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపల్లి అంగన్వాడీ కేంద్రంలో ‘మంగళవారం 10 నిమిషాలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి, మండల ప్రత్యేక అధికారి లక్ష్మిరాజం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడం, పోషకాహారం ప్రాధాన్యత, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ శంకర్, ఉప సర్పంచ్ తిరుపతి, సంబంధిత అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, తల్లులు పాల్గొన్నారు.

Clip Adjustments