Back to Home
Watermark
సోమవారం, 26 అక్టోబర్, 2026 TIME : 07:51 PM

27 న బాన్సువాడ కు మంత్రి సీతక్క రాక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇన్చార్జి మంత్రి పాల్గొంటున్నట్లు వెల్లడించిన పోచారం.

Main Image

తెలంగాణ అడ్డా ప్రతినిధి బాన్సువాడ:

27 న బాన్సువాడ కు మంత్రి సీతక్క రాక.బాన్సువాడకుపంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉమ్మడి నిజామాబాద్ ఇన్చార్జి మంత్రి సీతక్క అభివృద్ధి కార్యక్రమాల్లోపాల్గొనేందుకు బాన్సువాడ కు విచ్చేస్తున్నట్లు సోమవారం పోచారం తెలిపారు. బాన్సువాడ నియోజక వర్గ పరిధిలోపలుఅభివృద్ధికార్యక్రమాలప్రారంభోత్సవాల కు ముఖ్య అతిథి గా హాజరు కానున్న మంత్రి సీతక్కబాన్సువాడనియోజకవర్గం లో మంగళవారం రోజునపలుఅభివృద్ధికార్యక్రమాల ప్రారంభోత్సవాలు, నూతన నిర్మాణాల కు భూమి పూజకార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనసూయ సీతక్క బాన్సువాడ కు రానున్నారు. మంత్రి సీతక్క పర్యటన కు సంబంధించి బాన్సువాడ పట్టణ, గ్రామీణ మండలాల కు చెందిన ప్రజాప్రతి నిధులు, నాయకుల తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశమై ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి, కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశం లో రాష్ట్ర మాజీ ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు.మంత్రి సీతక్క పర్యటనలోభాగంగానిర్వహించనున్న కార్యక్రమాలుమధ్యాహ్నం 2 గంటల కు కొయ్యగుట్ట తాండలో: బాన్సువాడ గ్రామీణ మండలం కొయ్యగుట్ట తాండ లో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి భూమిపూజ, మధ్యాహ్నం 3 గంటల కు బాన్సువాడ పట్టణంలో: పట్టణం లోని 3వ వార్డు లో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనం ప్రారంభోత్సవం,

Additional Image

మధ్యాహ్నం 3:30 గంటల కు బోర్లం గ్రామ శివారు లో: బాన్సువాడ గ్రామీణ మండలం బోర్లం గ్రామ శివారు లో నూతనం గా నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం. ఈ కార్యక్రమాల కు సంబంధించి న ఏర్పాట్ల ను ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయం తో చేపట్టి విజయవంతం చేయాలని పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ సింగిల్ నుండి చైర్మన్ ఏరువాల కృష్ణారెడ్డి, మండల పరిధి లోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Clip Adjustments