Back to Home
Watermark
సోమవారం, 26 అక్టోబర్, 2026 TIME : 04:51 PM

కొమురం భీమ్‌కు బీసీ సాధికారిత సంఘం ఘన నివాళులు

Main Image

జల్‌–జంగల్‌–జమీన్‌ నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం పోరాటం

తెలంగాణ అడ్డా ప్రతినిధి వేములవాడ:

ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీక, గోండు వీరుడు కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా బీసీ సాధికారిత సంఘం రాష్ట్ర నేత, మాజీ సర్పంచ్ పొలాస నరేందర్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం పాలనలో ఆదివాసీల హక్కుల కోసం ‘జల్‌–జంగల్‌–జమీన్‌’ నినాదంతో కొమురం భీమ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు.

అణచివేతకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన కొమురం భీమ్ ఆదివాసీ అస్తిత్వ ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరాలకు మార్గదర్శకమని తెలిపారు.

ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమం అందాలని, అందరికీ తిండి, నీడ, వస్త్రం లభించాలనే సమానత్వ భావనను సమాజం ముందుకు తీసుకెళ్లాలని నరేందర్ పిలుపునిచ్చారు. కొమురం భీమ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ ఘన నివాళులర్పించారు.

Clip Adjustments