మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి కలెక్టర్ ACLB, DMWOలకు వినతి

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
బొమ్మకల్‌లోని విగ్రహం వద్ద ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో వేడుకలు జరపాలని డిమాండ్
దేశ విద్యా రంగానికి, మతసామరస్యానికి మౌలానా అందించిన సేవలు స్ఫూర్తిదాయకం
భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త, స్వతంత్ర భారతదేశ తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా కరీంనగర్ నగరంలోని బొమ్మకల్ ప్రాంతంలో ఉన్న ఆయన విగ్రహం వద్ద అధికారికంగా ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ (ACLB) మరియు నూతన జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారికి (DMWO) సోమవారం వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వినతిపత్రం అందజేసిన నాయకులు మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశ స్వాతంత్ర్య పోరాటంలో

పోషించిన కీలక పాత్రను, స్వతంత్ర భారతదేశంలో విద్యా వ్యవస్థ పునాదులకు ఆయన అందించిన మహోన్నత సేవలను నేటి యువతకు, భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన ఆశయాలు,జాతీయసమైక్యత,మతసామరస్యంమరియు విద్యా విలువలు నేటి సమాజానికి నిరంతరం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
వినతిపత్రంలోని ముఖ్య డిమాండ్లు
అధికారిక వేడుకలు బొమ్మకల్‌లోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహం వద్ద ప్రభుత్వ అధికారుల ప్రత్యక్ష సమక్షంలో అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించాలి.ముందస్తు ఏర్పాట్ల: వేడుకల నిర్వహణకు తగిన అనుమతులు మంజూరు చేయడంతో పాటు, స్థానికంగా అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కోరారు.
స్ఫూర్తిదాయక కార్యక్రమాలు మౌలానా సేవలను స్మరించుకుంటూ విద్య, సమైక్యతా భావాలను విస్తృతంగా ప్రచారం చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మహమ్మద్ షహనవాజ్ ఉద్దీన్, మతీన్, మహమ్మద్ మతీన్, ఇషాక్ తదితరులు పాల్గొన్నారు.