Back to Home
Watermark
శుక్రవారం, 23 అక్టోబర్, 2026 TIME : 08:39 PM

పినపాక ఎమ్మెల్యే, కమిటీ చైర్మన్ పాయం ను కలిసిన ఏ ఎం సి కార్యదర్శులు...

Main Image

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి)

Additional Image

పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లుని బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి కెంసారం శారద, భద్రాచలం వ్యవసాయ మార్కెట్ కమిటీ గ్రేడ్-1 కార్యదర్శి కనక శేఖర్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్యే పాయం ను కలిసి పుష్పగు చ్ఛంతో అభివాదం చేశారు.ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల నిర్వహణ,రైతులకు అందుతున్న సేవలు, వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్ర యాలకు సంబంధించిన అంశాలపై పరస్పరం మాట్లాడుకున్నారు.రైతులకు మెరుగై న సేవలు అందించడం,వ్యవసా య మార్కెట్ కమిటీల ద్వారా రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం, వారి ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా చర్చించారు.రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతల్లో భాగమని, రైతులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సేవలు సమర్థవంతంగా చేరేలా సంబంధిత అధికారులు బాధ్యతతో పనిచేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచించా రు.వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా రైతులకు మెరుగైన సౌకర్యాలు అందిం చేందుకు సమన్వయంతో పనిచేయడం అవసరమని పేర్కొన్నారు.ఈ మర్యాదపూ ర్వక భేటీలో బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి కెంసారం శారద,భద్రాచలం వ్యవసాయ మార్కెట్ కమిటీ గ్రేడ్-1 కార్యదర్శి కనక శేఖర్ పాల్గొన్నారు.

Clip Adjustments