Back to Home
Watermark
శుక్రవారం, 23 అక్టోబర్, 2026 TIME : 05:08 PM

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సవరన్ మసీదులో సీపీ గౌష్ ఆలం ప్రత్యేక ప్రార్థనలు

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

అమరవీరుల ఆత్మశాంతికి, కుటుంబాల సంక్షేమం కోసం ప్రత్యేక దువా

పోలీస్ అధికారులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్న సీపీ

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ శుక్రవారం స్థానిక సవరన్ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సమాజ రక్షణ కోసం, శాంతిభద్రతల పరిరక్షణలో విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ప్రత్యేక దువా చేశారు.అలాగే పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది క్షేమం, ప్రజా సంక్షేమం కోరుతూ సీపీ ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. సమాజ శాంతి పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ సీపీతో పాటు ఏసీపీలు యాదగిరిస్వామి, వెంకటస్వామి, విజయకుమార్, టౌన్ మరియు ట్రాఫిక్ సీఐలు, ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Clip Adjustments