గాంధీనగర్‌లో పర్యటించిన పినపాక ఎమ్మెల్యే, పాయం వెంకటేశ్వర్లు....

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి)..

మణుగూరు మున్సిపాలిటీ గాంధీ నగర్‌లో పినపాక ఎమ్మెల్యే, తెలంగా ణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటే శ్వర్లు శుక్ర వారం పర్యటించారు.ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న పరిస్థితు లను పరిశీలిస్తూ,ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గాంధీనగర్ ప్రాంత ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు,తాగునీరు,పారిశు ద్ధ్యం,రహదారులు,డ్రైనేజీ వంటి అంశాలపై స్థానికులతో చర్చించారు.అదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసు కున్నారు.ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథ కానికి సంబంధించి అర్హులైన పేద కుటుంబాల వివరాలు,ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితులు,ఇళ్ల మంజూ రు తదితర అంశాల పై స్థానిక ప్రజలతో మాట్లాడి వివరాలు సేకరించారు.సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిర మ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభు త్వ సంక్షేమ పథకాల ప్రయో జనాలు అందే లా కృషి చేస్తామని తెలిపారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికా రులకు సూచించారు.ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం,పేద కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం,మణుగూరు పట్టణ అభివృద్ధిని వేగవంతం చేయడం తన లక్ష్యమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నా రు.ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్,హౌసింగ్ ఏఈ, సంబంధిత అధికారులు,మండల అధ్యక్షు లు పిరినాకి నవీన్,టౌన్ అధ్యక్షులు కురం రవి ముదిరాజ్,జిల్లా ముఖ్యనాయకులు, సర్పంచులు,ఉపసర్పంచులు,వార్డు సభ్యులు,ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
