Back to Home
Watermark
శుక్రవారం, 23 అక్టోబర్, 2026 TIME : 08:37 AM

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొమురం భీమ్ జయంతి వేడుకలు..

Main Image

కొమురం భీమ్ జయంతి వేడుకలలో కొమరం భీమ్ కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు..

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

మన్యం వీరుడు కొమరం భీమ్ జయంతి సందర్భంగా మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ కొమరం భీమ్ కాంస్య విగ్రహానికి గురువా రం కాంగ్రెస్ పార్టీ మణుగూరు మండల అధ్యక్షులు పిరునాకి నవీన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల గురించి అలుపెరగని పోరాటం చేసిన మహావీరుడు అలాగే జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో ఆదివా సీలకు అడవిపై హక్కుల గురించి తన జీవితాన్ని త్యాగంచేసిన మహనీయుడు కొమరం భీమ్ అని కొనియాడారు.మన్యం వీరుడు కొమరం భీమ్ జయంతి సందర్భం గా వారినీ స్మరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి దొబ్బల వెంకటప్పయ్య,మహిళా అధ్యక్షురాలు కూరపాటి.సౌజన్య,సర్పంచ్లు కలబోయినా మాధవరావు,పూనెం రమేష్,కారం పూజిత,జగిడి ప్రసాద్,నియోజకవర్గ నాయకులు కాటిబోయిన నాగేశ్వర రావు, జీవీ,మండల నాయకులు కొమరం రామూర్తి,దొడ్డపనేని మధు,చప్పిడి సుబ్రమణ్యం,షేక్ యాకుబ్ అలీ,చింతల కృష్ణ,బొజ్జ త్రిమూర్తులు,బత్తుల శ్రీను, యువజన నాయకులు కట్ట మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments