ఘనంగా కొమరం భీం విగ్రహా విష్కరణ...

ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, పాయం వెంకటేశ్వర్లు,తెల్లం వెంకట్రావు.
తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).
దుమ్ముగూడెం మండలం ములకపాడు వై జంక్షన్ వద్ద ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా ,మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అన సూయ సీతక్కతో కలిసి పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంక టేశ్వర్లు,ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు,చందా లింగయ్య దొర,తాటి వెంకటేశ్వర్లు, ఆది వాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి,ఆయనకు ఘనంగా నివా ళులర్పించారు.

ఆదివాసీల హక్కుల కోసం కొమరం భీం చేసిన పోరాటం చిరస్మరణీయం: మంత్రి సీతక్క
ఈ సందర్భంగా మంత్రి సీతక్కమాట్లాడు తూ,ఆదివాసీల హక్కులు,ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప పోరాట యోధుడు కొమరం భీం అని కొనియాడారు.“జల్, జంగల్, జమీన్” అనే నినాదంతో ఆదివా సీలకు నీరు, అడవి, భూమిపై హక్కులు ఉండాలని ఆయన సాగించిన పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపో తుందని పేర్కొన్నారు.అణచివేతకు వ్యతిరేకంగా గిరిజన సమాజ హక్కుల సాధన కోసం ఆయన చేసిన త్యాగం, చూపిన ధైర్యం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి దాయకమని అన్నారు.కొమరం భీం ఆశయాలను కొనసాగిస్తూ ఆదివాసీ సమాజ అభ్యున్నతికి కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.గిరిజనుల సంస్కృతి, సంప్రదాయా లు,ఆచార వ్యవహారాలను పరిర క్షిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కృషి చేయాలని అన్నారు.గిరిజన ప్రాంతాల్లో విద్య,వైద్యం, రహదారులు,తాగునీరు, ఉపాధి వంటి మౌలిక అవసరాలకు ప్రాధాన్యత నిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఆదివాసీ యువత విద్యా, ఉద్యోగ రంగాల్లో ముందు కు సాగాలని, తమ హక్కులపై అవగాహన పెంపొందించు కోవాలని సూచించారు. కొమరం భీం పోరాట స్ఫూర్తిని భావితరాల కు అందిస్తూ,ఆదివాసీల గౌరవప్రదమైన జీవనానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కొమరం భీం ఆశయాల సాధనకు కృషి చేస్తాం, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు మాట్లాడు తూ,ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం పోరాడిన కొమరం భీం జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.ఆదివా సీ సమాజం ఆత్మగౌరవంతో,స్వేచ్ఛగా జీవించాలనే లక్ష్యంతో ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు.జల్,జంగల్,జమీన్” నినాదం ఆదివాసీల హక్కులు,వారి జీవన విధానం, ప్రకృతితో ఉన్న అనుబంధా నికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు.కొమరం భీం ఆశయాలకు అనుగు ణంగా గిరిజనుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం,అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, రహదారులు,తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపర చడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సమష్టి కృషి అవసరమని అన్నారు.గిరిజనుల సమస్య లను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు,అధికారులు సమన్వయంతో పనిచే యాలని పేర్కొన్నారు.ఆదివాసీ సంస్కృతి,సంప్రదాయాలు,భాష,వారస త్వాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్య కప్ అని,కొమరం భీం చరిత్ర ను భావితరా లకు తెలియజేయాలని పిలుపుని చ్చారు. ఆదివాసీల అభ్యు న్నతి,ఆత్మగౌరవ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తూ,కొమరం భీం ఆశయాల సాధనకు కట్టుబడి ఉంటా మని తెలిపారు.కొమరం భీం విగ్రహావి ష్కరణ కార్యక్రమం ఆదివాసీ సమా జంలో ఐక్యతను,ఆత్మగౌర వాన్ని మరింత బలోపేతం చేసే కార్యక్ర మంగా నిలిచింది.ఆయన పోరాట చరిత్రను స్మరించుకుంటూ,ఆదివాసీ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వా ములు కావాలని నాయకు లు ఆకాంక్షించారు.