ప్రజాప్రతినిధులకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ముదిరాజ్ సంఘం నాయకులు

తెలంగాణ అడ్డా ప్రతినిధి జిన్నారం
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, సంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, గూడెం మధుసూదన్ రెడ్డి, గూడెం విక్రం రెడ్డిలను మాజీ వార్డు సభ్యుడు, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నారబోయిన కుమార్ ముదిరాజ్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి వారందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మద్దూరి పెంటేష్, నారబోయిన శ్రీనివాస్, పొనగండ్ల సాయినాథ్, బోయిని దేవయ్య, నారబోయిన నాగరాజు, మోర ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.