స్మార్ట్ రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..

ముఖ్య అతిథిగా పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే, పాయం...
తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

గుండాల మండలంలోని రైతు వేదిక నందు నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మ ముబారక్ చెక్కుల పంపిణీ కి ముఖ్య అతిథిగా హాజరైన పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు గురువారం అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తు న్నాయని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.అదే విధంగా స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ సేవలు మరింత సులభతరం కానున్నాయని పేర్కొన్నారు.అలాగే పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాల సమయంలో ఆర్థిక భారం తగ్గించేందుకు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాలు ఎంతగానో ఉపయో గపడుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నా రు.ఈ కార్యక్రమంలో గుండాల ఎంఆర్‌ఓ సంగీత, ఎంపీడీవో బాలరాజు,హౌసింగ్ ఏఈ రాజేష్,ఏవో వెంకటరమణ,ఎంపీవో త్రిలోక్, పంచాయతీ సెక్రటరీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పొంబోయిన ముత్తయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఎస్‌కే ఖదీర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఊకె బుచ్చ య్య,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ధార అశోక్ పాల్గొన్నారు.