అర్హులకు ఇందిరమ్మ ఇంటి పట్టాల పంపిణీ...

ముఖ్య అతిథిగా హాజరైన పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు.

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం మణుగూరు మున్సిపల్ పరిధిలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటే శ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారు లకు పట్టాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయక త్వంలో,రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మా ణం,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సహకారంతో ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు, పట్టాల పంపిణీ ద్వారా వారి సొంతింటి కలను నిజం చేసేందుకు కృషి చేస్తోందని తెలిపారు.ప్రజా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. పేదల సంక్షేమం,నిరుపేద కుటుం బాలకు గృహ భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని,అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయో జనాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు సొంతింటి భరోసా కలగడంతో పాటు వారి జీవితాల్లో కొత్త ఆశలు చిగురి స్తాయని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్విని యో గం చేసుకోవాలని,పినపాక నియోజ కవర్గ అభివృద్ధికి,ప్రజల సంక్షేమా నికి నిరంతరం కృషి చేస్తానని పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.పేదల సంక్షే మమే లక్ష్యంగా,ప్రతి నిరుపేద కుటుం బానికి సొంతింటి భరోసా కల్పించే దిశగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా పేర్కొ న్నారు. కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్,ఎంపీవో, హౌసింగ్ ఏఈ,మండల అధ్యక్షులు,టౌన్ అధ్యక్షు లు,మైనారిటీ అధ్యక్షులు,మహిళా అధ్యక్షు రాలు,జిల్లా ముఖ్య నాయకులు,సర్పంచు లు,ఉపసర్పంచులు,వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు,మహిళా నాయకు లు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..