Back to Home
Watermark
బుధవారం, 14 అక్టోబర్, 2026 TIME : 01:54 PM

సాగునీటి కోసం గంగుల సమరశంఖం ఎస్సారెస్పీ డీ-86 కెనాల్ వద్ద రైతులతో కలిసి ధర్నా!

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ కెనాల్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్

నీళ్లు విడుదల చేయకుంటే బ్రిడ్జిపై నుంచి దూకుతానని అధికారులకు ఘాటు హెచ్చరిక

అధికారులతో చర్చలు జరిపి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించిన ఎమ్మెల్యే

కరీంనగర్ మరియు చొప్పదండి నియోజకవర్గాల పరిధిలోని రైతాంగ సాగునీటి హక్కుల సాధన కోసం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పోరుబాట పట్టారు. కళ్లముందే పంటలు ఎండిపోయే పరిస్థితి దాపరించినా అధికారుల నిర్లక్ష్యం వల్ల సాగునీరు అందకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, రైతాంగాన్ని వెంటబెట్టుకుని ఎస్సారెస్పీ (SRSP) డీ-86 కెనాల్ వద్ద భారీ ఆందోళనకు దిగారు.

ట్రాక్టర్ నడుపుతూ స్వయంగా రంగంలోకి.

Additional Image

ఉదయాన్నే స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ రైతులతో కలసి కెనాల్ ప్రాంతానికి చేరుకున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. రెగ్యులేటరీ గేట్లను వెంటనే ఎత్తి పంటలకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పంటలను కాపాడేందుకు నీటిని విడుదల చేయకపోతే కెనాల్ బ్రిడ్జిపై నుంచి నీటిలోకి దూకుతానని అధికారులను హెచ్చరించడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.

రైతులకు సాగునీటి పంపిణీలో వివక్ష ఎందుకు?

ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ, కరీంనగర్, చొప్పదండి ప్రాంతాల రైతులకు సాగునీటి పంపిణీలో ప్రభుత్వం, అధికారులు తీవ్ర వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. కష్టపడి సాగు చేసిన పంటలు చేతికి వచ్చే సమయంలో నీరు అందక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతన్నలు నష్టపోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

అధికారులతో చర్చలు – 300 క్యూసెక్కుల నీటి విడుదల:

ఎమ్మెల్యే పట్టుబట్టడంతో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని ఆయనతో సమగ్ర చర్చలు జరిపారు. రైతుల ఆవేదనను, పంటల పరిస్థితిని అధికారులకు వివరించిన గంగుల.. తక్షణమే డీ-86 కెనాల్ ద్వారా 300 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకునేలా చేశారు. నీటి విడుదల కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Clip Adjustments