Back to Home
Watermark
ఆదివారం, 11 అక్టోబర్, 2026 TIME : 04:38 PM

రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్‌ను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే, పాయం వెంకటేశ్వర్లు...

Main Image

హర్షం వ్యక్తం చేస్తు, ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన స్థానిక ప్రజలు.

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

Additional Image

మణుగూరు మున్సిపాలిటీ పరిధి లోని శివలింగాపురంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రం వద్ద రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్‌ను పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ఆదివారం ప్రారంభిం చారు.స్థానిక ప్రజలకు మెరుగైన రహదా రి సౌకర్యాలు కల్పించడంతో పాటు,మురు గునీరు సక్రమంగా పారేలా సైడ్ డ్రైన్ నిర్మాణం చేపట్టడం ద్వారా పరి సరాల పరిశుభ్రతకు, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడనుంది.ఈ సందర్భంగాఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ,పిన పాక నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అవసర మైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేప డుతున్నామని తెలిపారు.ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అదే విధంగా నాణ్యమైన సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా ప్రజల రాకపోక లు సులభతరం కావడంతో పాటు, రహదారులపై ప్రయా ణించే వారికి మెరుగైన సౌకర్యాలు అందు బాటు లోకి వస్తాయని తెలిపారు.శివ లింగాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రం పరిసరా ల్లో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం వల్ల వైద్య సేవల కోసం వచ్చే ప్రజల కు, అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులకు,వారి తల్లిదండ్రులకు రాకపోకల పరంగా ఎంతో సౌకర్యం కలుగు తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ముఖ్యం గా వర్షాకాలంలో రహదా రులపై నీరు నిలవడం,బురద కార ణంగా ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించేందుకు రహదారి నిర్మాణంతో పాటు సైడ్ డ్రైన్ ఏర్పాటు చేయడం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.రోడ్డు నిర్మా ణంతో పాటు సైడ్ డ్రైన్ ఏర్పాటు చేయడంవల్ల మురుగునీరు సక్రమంగా ప్రవహించేందుకు అవకాశం కలుగుతుందని,పరిసర ప్రాంతా ల్లో నీరు నిల్వ ఉండే సమస్యను తగ్గించ వచ్చని పేర్కొన్నారు.ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం,ఆరోగ్య కరమైన పరిసరాలను అభివృద్ధి చే యడం కూడా మౌలిక సదుపాయాల కల్పనలో ముఖ్య మైన భాగమని తెలిపారు.ప్రజల అవసరా లకు అను గుణంగా అభివృద్ధి పనులను చేపడుతూ, స్థానిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నామ ని వెల్లడించారు.కార్యక్రమంలో అధికారు లు,మణుగూరు మండల కాంగ్రెస్ అధ్యక్షు లు పిరినాకి నవీన్,టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు కురం రవి ముదిరాజ్,జిల్లా ముఖ్య నాయ కులు ప్రజాప్రతినిధులు,సర్పంచులు,ఉప సర్పంచులు,వార్డు సభ్యులు,మైనారిటీ నాయకులు,మహిళా నాయకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments