Back to Home
Watermark
శనివారం, 10 అక్టోబర్, 2026 TIME : 07:55 PM

చెలగాటమాడొద్దు.దుమ్ము నివారణ చర్యలు చేపట్టాలి....

Main Image

ప్రజల ను అనారోగ్యాలకు గురి చేస్తున్న, సింగరేణి యాజమాన్యం.

సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి.

Additional Image

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

సింగరేణి యాజమాన్యం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడొద్దని, దుమ్ము నివారణ చర్యలు చేపట్టాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి సింగరేణి యాజమా న్యాన్ని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ మణుగూరు, ఏటూరునాగారం ప్రధాన రహదారిలోని రైల్వే బ్రిడ్జి దగ్గర కనకదుర్గ మ్మ గుడి దగ్గర నుండి మల్లెపల్లి ఓసి కి పోయే మూలమలుపు వరకు లారీలు, బస్సులు ఇతర వాహనాల రాకపోకల సందర్భంగా విపరీతమైన బొగ్గు దుమ్ము లేస్తూ ఆ రహదారి గుండా ప్రజలు ప్రయా ణించలేని పరిస్థితి ఏర్పడు తుందన్నారు. ఆదుమ్ము పీల్చడం వలన ప్రజలు ఊపిరి తిత్తులు, శ్వాసకోశ వ్యాధులు తదితర రోగాల బారిన పడే ప్రమాదం ఉందన్నా రు.ముఖ్యంగా అక్కడే మెకానిక్ పనిచేసే షాపు యాజమానులు అలాగే అక్కడ పార్కింగ్ చేసుకుంటూ ఉన్నటువంటి లారీ డ్రైవర్లు, కార్మిక సంఘం కార్యాలయంలో ఉన్నటువంటి వారికి ఊపిరితిత్తుల వ్యాధి సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.సింగరేణి యాజమా న్యం ఈ సమస్యపై దృష్టి పెట్టి, రోడ్డుపై దుమ్ములేకుండా శుభ్రం చేయించి, వాటర్ స్ప్రే చేయించి దుమ్ము నివారణ చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అయినా ఇలాగే నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఆందోళన తప్పదన్నారు.

Clip Adjustments