Back to Home
Watermark
గురువారం, 08 అక్టోబర్, 2026 TIME : 05:18 PM

రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్టుకు నిరసనగా ఆందోళన....

Main Image

ధర్నా, రాస్తారోకోలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

Additional Image

ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ఓటర్ల జాబితా సవరణ అంశంపై నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనా మా చేయాలని డిమాండ్ చేసిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తదితర ప్రతిపక్ష ఎంపీలను పోలీసు లు అదుపులోకి తీసుకున్న ఘటనకు నిరసనగా మణుగూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.మణుగూరు అంబేద్క ర్ సెంటర్‌లో నిర్వహించిన ధర్నా, రాస్తారోకో కార్యక్రమాల్లో పినపాక ఎమ్మెల్యే, తెలంగా ణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు పాల్గొని కాంగ్రెస్ శ్రేణులకు సంఘీభావం తెలిపారు. అనంత రం పట్టణంలో నిర్వహించిన నిరసన ర్యాలీలోనూ ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని అన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని కోరారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి విశ్వాసం కలిగేలా పారద ర్శకత పాటించాల్సిన అవస రం ఉందన్నా రు.ఢిల్లీలో ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకోవ డంపై కాంగ్రెస్ నాయకులు అభ్యంత రం వ్యక్తం చేశారు. ప్రజల ఓటు హక్కు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని తెలిపా రు.మణుగూరు అంబేద్కర్ సెంటర్‌ లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వా నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంత రం పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వ హించారు.ర్యాలీలో ఎమ్మె ల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలి పారు.ఈ కార్యక్రమాల్లో మణుగూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పీరినాకి నవీన్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కురం రవి ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, సర్పంచులు, ఉపస ర్పంచు లు,వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతిని ధులు,మండల,పట్టణ నాయకులు, అను బంధ సంఘాల నాయకులు, ఐ ఎన్ టి యు సి నాయకులు,లారీ యూనియన్ ప్రతినిధులు, బొగ్గు ముఠా కార్మికులు, గుమాస్తాల సంఘం నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు,మహి ళా కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Clip Adjustments