Back to Home
Watermark
గురువారం, 08 అక్టోబర్, 2026 TIME : 04:54 PM

మహిళా సాధికారతకు బతుకమ్మ వేడుకలు ప్రతీక....

Main Image

మణుగూరు డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

విద్యార్థులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం.

Additional Image

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి ).

మణుగూరు మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుక మ్మ సంబరాలు గురువారం ఘనంగా నిర్వహిం చారు.ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసన సభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథి గా హాజరై వేడుకలను ప్రారంభించా రు.ఈ సందర్భంగా మహిళలు, విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో రంగురంగుల పూల తో బతుకమ్మ లను అందంగా పేర్చి, బతుక మ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడు కల్లో పాల్గొన్నారు.ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా వారితో కలిసి సందడి చేశారు.ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ,బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదా. యాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతితో మమేకమైన మన సంస్కృతికి బతుకమ్మ ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళా సాధికారతతో పాటు విద్యార్థి నుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించ డం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నా రు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని,విద్య,ఉపాధి, సామాజిక రంగా ల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిం చారు.తెలంగాణ సంస్కృతి, సంప్ర దాయాలను భావితరాలకు అందించ డంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావా లని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వై. చిన్న ప్పయ్య,ఉమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ కోఆర్డి నేటర్ ఆర్. వీణ, సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, జిల్లా నాయకులు దొబ్బల.వెంకటప్పయ్య, ముఖ్య నాయకులు ఎస్. గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments