Back to Home
Watermark
గురువారం, 08 అక్టోబర్, 2026 TIME : 02:26 PM

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడు తోంది రేవంత్ ప్రభుత్వం....

Main Image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

మణుగూరు ప్రాంతాన్ని అక్రమ ఇసుక రవాణా,బొగ్గు దుమ్ముతో నాశనం చేస్తూ ప్రజల ప్రాణాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెలగాటమాడుతోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు, పినపా క మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం మణుగూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ నెల 10న ‘ఛలో మణుగూరు’ బంద్ కు పిలుపు.

Additional Image

ప్రజల సమస్యలపై ప్రభుత్వం స్పందించ కపోవడంతో ఈ నెల 10న ఛలో మణుగూరు’ పేరుతో భారీ బంద్ కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజాసంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.అక్రమ ఇసుక రవాణా, బొగ్గు లారీల ధాటికి రోడ్లన్నీ గుంతలమయమై ప్రమాదాలకు నిలయంగా మారాయి.

విచ్చలవిడిగా తిరుగుతున్న లారీల వల్ల వెలువడుతున్న దుమ్ము, ధూళితో ప్రజలు ఊపిరితిత్తుల వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కేసీఆర్ హయాంలో వందల కోట్ల రూపాయల నిధులతో సాగిన అభివృద్ధి, నేడు రోడ్లు శుభ్రం చేయడానికి కూడా నోచుకోవడం లేదు.సింగరేణి సీఎస్ఆర్, డీఎంఎఫ్టీ నిధులను సరిగ్గా వినియోగించకుండా రహదారుల నిర్వహణను గాలికి వది లేశారు.

పోరాటం ఉధృతం:

‘ఛలో మణుగూరు’ పేరుతో భారీ నిరసన చేపట్టి, ఇసుక క్వారీలను నిర్బంధించి, ఎక్కడి లారీలను అక్కడే నిలిపివేస్తామని హెచ్చరించారు.పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్న సింగరేణి యాజమాన్యం మరియు ఇసుక కాంట్రాక్టర్లపై ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్)ను ఆశ్రయిస్తామని తెలిపా రు.గిరిజన సర్పంచ్ లను ముందుపెట్టి కాంట్రాక్టర్లు రాజకీయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని రేగా కాంతారావు స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ జెడ్పిటిసి పొషం నరసింహ రావు.మండల అధ్యక్షులు కురి నాగేశ్వరరావు.అడపా అప్పారావు,మాజీ కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా. వత్తం రాంబాబు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Clip Adjustments