Back to Home
Watermark
శుక్రవారం, 02 అక్టోబర్, 2026 TIME : 12:56 PM

ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు..

Main Image

గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాయం..

తెలంగాణ అడ్డా న్యూస్, భద్రాద్రి జిల్లా ప్రతినిధి.

జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరించి ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జయంతి వేడుకల సందర్భంగా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్ర మంలో ఎమ్మెల్యే పాయం వెంకటే శ్వర్లు ముఖ్యఅతిథిగా పాల్గొని మహాత్మా గాంధీ చిత్రప టానికి పూలమాల వేసి ఘనంగా నివాళుల ర్పించారు.ఈ సంద ర్భంగా స్వాతం త్ర్య సంగ్రా మంలో గాంధీజీ పోషించిన కీలక పాత్రను స్మరించుకు న్నారు.గాంధీజీ అనుసరించిన అహింసా మార్గం, సత్యాగ్రహ సిద్ధాంతాలు నేటికీ సమా జానికి మార్గదర్శకంగా నిలుస్తున్నా యని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంట రానితనం నిర్మూలన,సామాజిక సమా నత్వం, గ్రామ స్వరాజ్యం, స్వదే శీ వస్తువు ల వినియోగం, పేదల అభ్యున్నతి వంటి అంశాలకు గాంధీజీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు.అలాగే ప్రస్తుత సమాజంలో శాంతి,సహనం,పరస్పర గౌరవం,సోదరభావం ఎంతో అవసరమని అన్నారు. విభేదాలను హింసకు తావు లేకుండా చర్చల ద్వారా పరిష్క రించుకో వాలని సూచించారు.ము ఖ్యంగా యువత గాంధీజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సత్యం,అహిం స,క్రమశిక్షణ,సేవాభావం వంటి విలువలను జీవితంలో ఆచరించా లని కోరారు.అదేవిధంగా పేదలు, బలహీన వర్గాలు, అణగారిన ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూ సమానత్వంతో కూడిన సమా జ నిర్మాణంలో భాగస్వాములు కావడ మే మహాత్మా గాంధీకి అందించే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే పేర్కొ న్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పిరినా కి నవీన్,టౌన్ అధ్యక్షులు కుర్రం రవి, జిల్లా ముఖ్య నాయకు లు, సర్పంచులు, ఉపస ర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయ కులు, ప్రజాప్రతినిధులు, కార్య కర్తలు, మహిళా నాయకులు, అభిమా నులు తదితరులు పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Clip Adjustments