చలో ఉస్మానియా యూనివర్సిటీ విజయవంతం చేయాలి

తెలంగాణ అడ్డా కొనరావుపేట ప్రతినిధి:
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు MSF నూతన కమిటీల నిర్మాణంలో భాగంగా నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట కేంద్రంలోనీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎమ్మార్పీఎస్ కొనరావుపేట మండల అధ్యక్షులు అక్కనపెల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా MRPS మాజీ జిల్లా కన్వీనర్ ఎలగందుల బిక్షపతి మాదిగ హాజరై మాట్లాడుతూ.. సమాజంలో సబ్బండ వర్గాలకు పోరాటం చేసి సేవలు అందించిన చరిత్ర ఎమ్మార్పీఎస్ ఉందని, ఆరోగ్యశ్రీ పథకం వృద్ధులు వితంతువుల పెన్షన్, తెల్ల రేషన్ కార్డ్ బియ్యం కోటా పెంపు ఇలా చూసుకుంటే ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసి జాతీయస్థాయిలో మాదిగ కులానికి పేరు తెచ్చిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో విద్యార్థి విద్యార్థినిలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునివ్వడం జరిగింది..
సమావేశం అనంతరం కళాశాల నూతన కమిటీ వేయడం జరిగింది.
అధ్యక్షులుగా :-నేరెళ్ల హర్షవర్ధన్ మాదిగ,
అధికార ప్రతినిధిగా:-ఎర్రగళ్ల సృజన్ మాదిగ,
ప్రధాన కార్యదర్శిగా:-తంగళ్ళపల్లి గణేష్ మాదిగ, కోశాధికారిగా:-కన్నం రాహుల్ మాదిగ,
కార్యదర్శిగా:-బొడ్డు యశ్వంత్ మాదిగ గార్లను నియమించడం జరిగినది.
*అమ్మాయిల విభాగం*. అధ్యక్షురాలుగా:-తంగళ్ళపల్లి కావ్య మాదిగ, అధికార ప్రతినిధిగా,:-దప్పుల మేఘన మాదిగ, ప్రధాన కార్యదర్శిగా:-మల్యాల లిప్సిక మాదిగ, కోశాధికారిగా:-మల్యాల ప్రణీత మాదిగ, కార్యదర్శిగా:-గుడికందుల హాసిని మాదిగ, గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.
ఈ సమావేశంలో పాల్గొన్నవారు ఎమ్మార్పీఎస్ కోనరావుపేట గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లి బాబు మాదిగ, ఎగ్లాస్పూర్ గ్రామ శాఖ అధ్యక్షులు జాను మాదిగ తదితరులు పాల్గొన్నవారు.