Back to Home
Watermark
గురువారం, 01 అక్టోబర్, 2026 TIME : 08:31 PM

రాజకీయానికే వన్నెతెచ్చిన మహోన్నత వ్యక్తి బిరుదు బడుగు బలహీన వర్గాల నేత ఘనంగా స్వర్గీయ బిరుదు 76 జయంతి వేడుకలు

Main Image

ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు

చింతకుంట విజయ రమణారావు

పెద్దపల్లి జిల్లా అక్టోబర్ 01 ( తెలంగాణ అడ్డా)

Additional Image

సుల్తానాబాద్ మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు చౌరస్తా వద్ద రాజమల్లు జయంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులతో కలిసి వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి 76వ జన్మదిన వేడుకలను నిర్వహించి స్వీట్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ

సుల్తానాబాద్ మండల కేంద్రంలో జన్మించిన రాజమల్లు తన రాజకీయ ప్రస్థానాన్ని కారబోరుగా ప్రారంభించి సర్పంచ్ ఎంపీపీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా అనేక పదవులను అనుభవించి రాజకీయాలలో తనదైన ముద్రను వేసి నియోజకవర్గ వ్యాప్తంగా అనుచర గణంతోపాటు అభిమానులను సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి బిరుదు రాజమల్లు అని కొనియాడారు. నేడు రాజమల్లు తో రాజకీయ ప్రస్థానం చేసిన అనేకమంది వివిధ పదవులలో ఉన్నారని గుర్తు చేశారు. తాను రాజ మల్లన్న కు ప్రేయ శిష్యుడిని అని అన్నారు. అవినీతికి తావు లేకుండా పాలనను అందించిన వ్యక్తి అని కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా సేవలందించిన వ్యక్తిని గుర్తు చేశారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం గత పది సంవత్సరాలుగా రాజమల్లు జయంతిని పురస్కరించుకొని నిరుపేదలకు అందిస్తున్న చీరేలు మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి అందించారు.ఈ కార్యక్రమంలో బిరుదు రాజమల్లు సతీమణి సుశీల తో పాటు మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో అనుచర గణం అభిమానులు వివిధ గ్రామాల సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, లు, మార్కెట్ కమిటీ చైర్మన్ మినపాల ప్రకాష్ రావు, లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Clip Adjustments