రాంపూడి నాగమణికి రూ.5 లక్షల ఎల్ వో సి అందజేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు...

తెలంగాణ అడ్డా న్యూస్, భద్రాద్రి జిల్లా ప్రతినిధి.
అశ్వాపురం మండలం బుడుగు బజార్‌కు చెందిన రాంపూడి నాగమణికి వైద్య చికిత్స నిమిత్తం రూ.5 లక్షల విలువైన ఎల్‌ఓసీ ని పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ ఛైర్మన్ పాయం వెంకటేశ్వర్లు గురువారం అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నాగమణి కుటుంబా నికి ఈ ఆర్థిక సహాయం ఎంతో తోడ్పాటునం దించనుంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందుబా టులో ఉండాలనే లక్ష్యంతో ముఖ్య మంత్రి సహాయనిధి ద్వారా అర్హులైన వారికి ఆర్థిక సహాయం అందేలా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వ ర్లు కృషి చేస్తున్నారు.ఆర్థిక ఇబ్బందు ల కారణంగా ఎవరికీ వైద్య చికిత్స ఆగిపోకూడదనే ఉద్దేశంతో అవసర మైన వారికి ప్రభుత్వ సహాయం అందేలా చొరవ తీసుకుంటు న్నారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ,వారి సమస్యలను పరిష్క రించేందుకు నిరంతరం కృషి చేస్తు న్నారు.ఈ సందర్భంగా నాగమ ణి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకి కృతజ్ఞతలు తెలిపారు.