Back to Home
Watermark
బుధవారం, 30 సెప్టెంబర్, 2026 TIME : 09:11 PM

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల కొరడా.. నాలుగు ట్రాక్టర్లు సీజ్

Main Image

కమలాపూర్ తెలంగాణ అడ్డా: అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను కమలాపూర్ పోలీసులు సీజ్ చేశారు. బుధవారం మండలంలోని ఉప్పల్ వద్ద ఎస్సై మధు సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు.

మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన నాలుగు ట్రాక్టర్లను గుర్తించి సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. ట్రాక్టర్ల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Clip Adjustments