భగత్‌సింగ్ ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం ఓటర్ల జాబితాలో డూప్లికేట్ నమోదులను పరిశీలించాలని బీజేపీ నాయకుల వినతి

భగత్‌సింగ్ ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం
ఓటర్ల జాబితాలో డూప్లికేట్ నమోదులను పరిశీలించాలని బీజేపీ నాయకుల వినతి
పటాన్‌చెరువు, సెప్టెంబర్ 28, తెలంగాణ అడ్డా:
పటాన్‌చెరువు టౌన్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ జయంతి వేడుకలను నిర్వహించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐఆర్ అసెంబ్లీ కన్వీనర్ రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్‌సింగ్ చేసిన త్యాగం, దేశభక్తి, ధైర్యం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
అనంతరం ఓటర్ల జాబితా పరిశీలనకు సంబంధించి పటాన్‌చెరువు ఎమ్మార్వో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఓటర్ల జాబితాలో ఒకే వ్యక్తికి సంబంధించిన డూప్లికేట్ నమోదులు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని బీఎల్‌ఓల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవ పరిస్థితులను నిర్ధారించిన అనంతరం ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు రక్షించడంతో పాటు ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్‌ఐఆర్ అసెంబ్లీ కన్వీనర్ రాజేందర్‌రెడ్డి కూడా డూప్లికేట్ నమోదులను నిబంధనల ప్రకారం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు మురళి, లక్ష్మణ్, కృష్ణమూర్తి, జగన్‌రెడ్డి, రవి, శివ తదితరులు పాల్గొన్నారు.