ఎల్‌ఓసీ ద్వారా రూ.2.20 లక్షల వైద్య సాయం...

ఎల్‌ఓసీ ద్వారా రూ.2.20 లక్షల వైద్య సాయం...
ఎమ్మెల్యే పాయం కు కృతజ్ఞతలు తెలిపిన అరవింద్ కుటుంబ సభ్యులు..
తెలంగాణ అడ్డా ప్రతినిధి ( భద్రాద్రి జిల్లా
అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామానికి చెందిన మద్దెల అరవింద్‌కు చేతికి సంబంధించిన ఆపరేషన్ అవసరం కాగా, నిజామ్స్ హాస్పిటల్‌లో చికిత్సకు సుమారు రూ.2,20 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు.దీంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న అరవింద్ కుటుంబానికి సహాయం అందించాలని అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చెంచల రాము ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లా రు.విషయాన్ని తెలుసు కున్న ఎమ్మెల్యే పాయం వెంటనే స్పందించి, ముఖ్యమంత్రి సహాయ నిధి (ఎల్‌ఓసీ) ద్వారా రూ.2,20 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేయించేందుకు కృషి చేశారు.దీంతో అరవింద్‌కు అవసరమైన ఆపరేషన్ పూర్తయింది.ఆపరేషన్ విజయ వంతం కావడంతో సంతోషించిన అరవింద్ ఎమ్మెల్యే ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.తన వైద్య చికిత్సకు ఆర్థికంగా అండగా నిలిచి, ఆపరేషన్‌కు అవసరమైన సహాయం అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ వైద్య చికిత్సలకు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తున్న పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కి మల్లెలమడుగు గ్రామానికి చెందిన మద్దెల అరవింద్ కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పొడిశెట్టి ఖాదర్, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకి నవీన్, నాయకులు కోడి అశోక్, భూపాలపట్నం సర్పంచ్ భవతి, తదితరులు పాల్గొన్నారు.