Back to Home
Watermark
ఆదివారం, 20 సెప్టెంబర్, 2026 TIME : 08:28 PM

కరీంనగర్ బల్దియాలో పారిశుధ్య ట్రై సైకిళ్ల పంపిణీ, ఫాగింగ్ యంత్రాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ:

కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం రోజున పారిశుధ్య కార్మికులకు నూతన ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మరియు పాలకవర్గ సభ్యులతో కలిసి నగరపాలక సంస్థ నూతనంగా కొనుగోలు చేసిన రెండు ఫాగింగ్ యంత్రాలను, 66 ట్రైసైకిళ్లను ప్రారంభించారు. డివిజన్‌కు ఒకటి చొప్పున ఈ ట్రైసైకిళ్లను కార్మికులకు పంపిణీ చేశారు.

అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతిని మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మరియు పాలకవర్గ సభ్యులతో కలిసి దర్శించుకుని, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Clip Adjustments