కోనరావుపేటలో ఘనంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

1. మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు
2. పెద్ద సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
3. ఆది శ్రీనివాస్ ప్రజా సేవలను కొనియాడిన నాయకులు
4. నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్ష
కోనరావుపేట, సెప్టెంబర్ 19 (తెలంగాణ అడ్డ):
కోనరావుపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానుక సత్యం ఆధ్వర్యంలో వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఆది శ్రీనివాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చేపూరి గంగన్న, గొట్టే రుక్మిణి, ఫిరోజ్ పాషా, నాలుక సత్యం తదితరులు పాల్గొన్నారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, మండల కమిటీ నాయకులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆది శ్రీనివాస్ ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై ఆయన దృష్టి సారిస్తున్నారని తెలిపారు.
వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్ర అభివృద్ధితో పాటు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వ విప్‌గా, ఎమ్మెల్యేగా ప్రజలకు మరింత సేవలందించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కచ్చకాయల బాలరాజు, మాజీ సర్పంచ్ సుద్దాల, కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.