Back to Home
Watermark
గురువారం, 17 సెప్టెంబర్, 2026 TIME : 09:27 PM

ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

Main Image

ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

టేక్మాల్, సెప్టెంబర్ 17 (తెలంగాణ అడ్డా):

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని టేక్మాల్ మండల కేంద్రంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

టేక్మాల్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై అరవింద్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద తులసీరామ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు.

వ్యవసాయ కేంద్రం వద్ద ఏఈఓ రాంప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ తిమ్మిగారి సుధాకర్, ఉపసర్పంచ్ మేకలకాడి శంకరయ్య జాతీయ జెండాను ఎగురవేశారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ హర్షిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మండల కేంద్రంలోని వివిధ కార్యక్రమాల్లో పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Clip Adjustments