Back to Home
Watermark
ఆదివారం, 06 సెప్టెంబర్, 2026 TIME : 05:57 PM

హుస్సేన్ సాగర్ తీరంలో ఘనంగా తెలంగాణ గంగా తెప్పోత్సవం

Main Image

హుస్సేన్ సాగర్ తీరంలో ఘనంగా తెలంగాణ గంగా తెప్పోత్సవం

భక్తిశ్రద్ధలతో గంగా హారతి.. సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన వేడుక

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా

హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌ వద్ద హుస్సేన్‌సాగర్‌ తీరంలో తెలంగాణ గంగా తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ వేడుకలో మహిళలు, గంగపుత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని గంగా హారతిలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. దీంతో హుస్సేన్‌సాగర్‌ తీరం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక గంగా హారతిని ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు స్వీకరించారు. తెలంగాణలోని మత్స్యకారులు, గంగపుత్రుల సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలను గౌరవిస్తూ వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

హుస్సేన్‌సాగర్‌ తీరంలో నిర్వహించిన గంగా తెప్పోత్సవం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు సముచిత ప్రతీకగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. గంగపుత్రుల సంక్షేమం, మత్స్యకారుల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

గంగా మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సంప్రదాయ కళలు, ఆచారాలు, సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

Clip Adjustments